Tuesday, February 2, 2010

వైష్ణవి స్మృతిలో.. రమేష్ గేయం

నిజమే..
డబ్బు పాపిష్టిదే!
ఎవరికి తెలియదు?
ఆ చిన్నారికి తప్ప?

తెలియని విషయాలు తెలియచెప్పే పద్ధతి వేరు..
ఇలా ప్రాణాలు తీసి కాదు.
ఇలా తన తండ్రి మీద కోపం చిన్నారిపై చూపి కాదు.
ఈరోజు ఎన్ని గుండెలు అడిగాయి..
ఆ చిన్నారి లేచి రావాలని?
ఆ తండ్రి శ్వాస ఆడాలని?
ఆ రాక్షసులకి కఠిన శిక్ష పడాలని?

కొన్ని రోజుల్లో మరో ఎన్‌కౌంటర్..
లేదా మరో సంఘటన..

నిందితులు హతం!

ఇదేనా న్యాయం?
ఆ కన్నతల్లి కడుపుకోత తీర్చేదెవరు?
ఆ ఇల్లాలి గుండెకోత మానేలా చేసేదెవరు?

Get this widget | Track details | eSnips Social DNA

Friday, December 25, 2009

స్వాగతం


Get this widget
|
Track details
|
eSnips Social DNA

నమస్కారం.

"నాగొంతుక" వినేందుకు స్వాగతం.

కొన్నిరోజులుగా బిజీగా ఉండటంతో నా బ్లాగులు సరదాకి, అంతర్వాహినిలను అప్‌డేట్ చేయటం కుదరటం లేదు. అందుకే టైప్ చేయటానికి టైం లేనప్పుడు కూడా నా భావాల్ని, అభిప్రాయాల్ని పంచుకోవాలనుకుంటున్నాను.

ఫలితమే.. ఈ వాయిస్ బ్లాగ్.. "నా గొంతుక".



నా ఇతర బ్లాగులకు మీరంతా ఇస్తున్న ఆదరణే "నా గొంతుక"కు కూడా ఉంటుందని ఆశిస్తున్నా..
Thank You..

Signing Off..
నరేష్ నందం.